పాఠ్యపుస్తకాలు

పాఠ్యపుస్తకములు - సామర్థ్యములు

తెలంగాణ ప్రభుత్వము 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కొరకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి ద్వారా పాఠ్యపుస్తకాలను ముద్రిస్తున్నది. ఈ పాఠ్యపుస్తకాల ద్వారా విద్యార్థులలో సాధించవలసిన ముఖ్య సామర్థ్యాలు (విద్యా ప్రమాణాలు) ఇవి:

  1. వినడం - ఆలోచించి మాట్లాడటం: విన్న విషయాలను అర్థం చేసుకొని, విశ్లేషించి, తార్కికంగా ఆలోచించి, సొంత అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తీకరించడం.

  2. ధారాళంగా చదవడం - అర్థం చేసుకొని ప్రతిస్పందించడం: పాఠ్యభాగాలను (గద్యం, పద్యం) మరియు ఇతర పుస్తకాలను ధారాళంగా, సరైన ఉచ్చారణతో చదవడం, చదివిన అంశాన్ని అర్థం చేసుకొని, విశ్లేషించి, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం.

  3. స్వీయరచన: ప్రశ్నలకు సొంతమాటల్లో జవాబులు రాయడం, వివిధ అంశాలపై వ్యాసాలు, లేఖలు, నివేదికలు వంటివి నిర్దిష్టమైన నిర్మాణం (format) పాటిస్తూ రాయగలగడం.

  4. పదజాలం: కొత్త పదాలకు అర్థాలు తెలుసుకోవడం, వాటిని సందర్భోచితంగా సొంత వాక్యాలలో ఉపయోగించడం. అలాగే పర్యాయపదాలు, నానార్థాలు, వ్యుత్పత్త్యర్థాలు, జాతీయాలు వంటి వాటిపై పట్టు సాధించడం.

  5. సృజనాత్మకత / ప్రశంస: పాఠ్యాంశ స్ఫూర్తితో కథలు, కవితలు, సంభాషణలు, నినాదాలు, పోస్టర్లు వంటివి సృజనాత్మకంగా రాయగలగడం. అలాగే, కవుల శైలిని, పాత్రల స్వభావాన్ని, ప్రకృతి అందాలను ప్రశంసిస్తూ, అభినందిస్తూ రాయగలగడం.

  6. భాషాంశాలు (వ్యాకరణం): భాషానియమాలను (సంధులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, వాక్య భేదాలు) అర్థం చేసుకొని, భాషను దోషాలు లేకుండా సరిగ్గా ఉపయోగించడం.

  7. ప్రాజెక్టు పని: సమాచార సేకరణ, విశ్లేషణ, బృందచర్చ మరియు నివేదిక తయారీ వంటి నైపుణ్యాలను పెంపొందించుకోవడం.

తెలుగు పాఠ్యపుస్తకములు తరగతి వారీగా క్రింది లింక్‌లలో పొందుపరచబడ్డాయి.