లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్ (LIP)
పాఠశాల స్థాయి విద్యార్థులలో ప్రాథమిక భాషా సామర్థ్యాలైన వినడం, మాట్లాడటం, చదవడం, రాయడం (LSRW) లను పటిష్టం చేసి, తరగతికి తగిన అభ్యసన స్థాయిలను పెంపొందించడానికి ఉద్దేశించినదే 'లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్' (LIP). భాషా నైపుణ్యాలలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిలో అభ్యసన లోపాలను సరిదిద్ది, స్వయం అభ్యసన ద్వారా స్థాయిని మెరుగుపరచడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.
ఈ డిజిటల్ టూల్స్ ఎవరికి ఉపయోగపడతాయి?
ప్రాథమిక స్థాయి అభ్యాసకులకు:
తెలుగు వర్ణమాల, గుణింతాలు, ద్విత్వ-సంయుక్తాక్షరాల ధ్వనులు మరియు గుర్తులను సులభంగా గుర్తించడానికి.
సరళ పదాల నుండి సంక్లిష్ట పదాలను చూడగానే చదివే వేగాన్ని పెంచుకోవడానికి.
పఠనంలో వెనుకబడిన విద్యార్థులకు:
భయం, తడబాటు లేకుండా స్వయంగా అక్షరాలను, పదాలను, వాక్యాలను నిర్మిస్తూ ఆడుతూ పాడుతూ నేర్చుకోవడానికి. నిమిషానికి 50-60 పదాల వేగంతో ధారాళంగా చదవడం అలవర్చుకోవడానికి.
ఉపాధ్యాయులకు:
డిజిటల్ తరగతి గదుల్లో, కంప్యూటర్ ల్యాబ్‌లలో విద్యార్థులకు ఇంటరాక్టివ్ రీడింగ్ ప్రాక్టీస్ మరియు ఉపశమన బోధన (Remedial Teaching) అందించడానికి. విద్యార్థుల పఠన స్థాయిని (Comprehension & Accuracy) క్షణాల్లో అంచనా వేయడానికి.
తల్లిదండ్రులకు :
ఇంటి వద్ద పిల్లలకు సులభ పద్ధతిలో తెలుగు చదవడం, రాయడం మరియు అర్థం చేసుకోవడం నేర్పించడానికి ఈ టూల్స్ చక్కని సాధనాలుగా ఉపయోగపడతాయి.
ఇమెయిల్
contact@telanganabadi.in
9440227064
© 2025. All rights reserved.
ఫోన్:
